
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో శక్తి యాప్ (Shakthi App) అవగాహన కార్యక్రమాలు మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించబడుతున్నాయి.ఈ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినులు, మహిళలు, చిన్నారులకు శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా తక్షణ పోలీసు సహాయం ఎలా పొందవచ్చో, మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన భద్రతా సేవల గురించి వివరించారు.అదేవిధంగా చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ భావనను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే POCSO చట్టం, బాలల హక్కులు, మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాల నుంచి రక్షణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ఎలాంటి వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ కోసం ఆధునిక సాంకేతికతతో పాటు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు.