
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల సింగరాయకొండలో గురువారం నాడు ఆ పాఠశాలలో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయిని శ్రీమతి టీ.అంజమ్మ పాఠశాలకు 25 వేల రూపాయలు విలువచేసే ప్యాంటమ్ కంప్యూటర్ ప్రింటర్‌ను బహుకరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కే మహాలక్ష్మి గారు మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన ఈ ప్రింటర్‌ను బహుకరించినందుకు ఉపాధ్యాయిని అంజమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంజమ్మ పాఠశాలకు అవసరమైనప్పుడు సహాయం చేయటం నిజంగా అభినందించదగ్గ విషయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.