
మిషన్ హరితోదయ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.సి ఐ శ్రీహరి విద్యార్థులకు పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
విద్యార్థి దశ నుండి ప్రకృతిని ప్రేమించడం తో పాటు హరితాంధ్ర సాధనలో మిషన్ హరితోదయ పిలుపు తో ప్రతి విద్యార్థి వారి వారి నివాసాలు, ప్రాణాలు విద్యా సంస్థల వద్ద మొక్కను పెంచాలని సింగరాయకొండ సిఐ శ్రీహరి విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. శనివారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో మొక్కలు నాటడం తో పాటు చైతన్య టెక్నో విద్యాసంత నిర్వహించిన మిషన్ హరితోదయ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మొక్కల పెంపకం , దాని ప్రాధ్యత సమాజానికి మొక్కలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి అవగాహన కల్పించారు. గ్రామాలు, నివాస ప్రాంతాలు , విద్యాసంస్థల వద్ద ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి దాని పోషణకు కొంత సమయం కేటాయించాలని ఆవిధంగా పెద్దల లో అవగాహన కల్పించడం బాధ్యతగా తీసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ముందుగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో మొక్కలు నాటడం అందరిని ఆకర్షించింది. అనంతరం ప్రధాన వీధులలో మిషన్ హరితోదయ పిలుపు ఇస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది, చైతన్య టెక్నో విద్యాసంస్థ పర్యవేక్షకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.