
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యల్లో భాగంగా జారుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది పైడిపాడు గ్రామ శివారులో ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.12,700/- నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అక్రమ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.