
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, పార్కులు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేపట్టి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించారు. మహిళలను వేధించే వారు, అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్థానిక పోలీసులకు లేదా అత్యవసర సేవలకు సమాచారం అందించాలని, ప్రజలు కూడా మహిళల భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.