
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ముండ్లపాడు గ్రామానికి చెందిన బైనగారి శశికల ఆటో నుండి దూకి తీవ్ర గాయాలైన ఘటన అందరికి విధితమే. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శశికల చికిత్స కోసం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సహాయం చేసే ధాతల కోసం ఆమె కుటుంబం ఎదురు చూస్తూ ఉంది . ఆమెకు చికిత్స కోసం గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం మాజీ శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి rs. 55000/- రూపాయలు ముండ్లపాడు గ్రామ పంచాయతీ వైసీపీ నాయకుల ద్వారా శశికల భర్త బైనగారి దేవదానం కు అందచేశారు. ఈ కార్యక్రమంలో ముండ్లపాడు పంచాయతీ వైసీపీ నాయకులు చిలకల ప్రతాప్ రెడ్డి, CID రంగారెడ్డి,కలువ సుబ్బారావు, పడిగపాటి రాజ శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.