
పేకాట ఆడుతున్న స్థావరంపై టంగుటూరు పోలీసులు దాడులు నిర్వహించి ఏడుమందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.44,850/- నగదు, ఆరు సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై టంగుటూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసేపల్లి గ్రామల శివారులో తేదీ:26.07.2026న పేకాట స్ధావరంపై టంగుటూరు ఎస్సై బి.ఫణిభూషణ్ మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏడు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.44,850/- నగదు, 6 మొబైల్ ఫోన్లును, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, మండలం లో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా టంగుటూరు SI గారి నంబర్ 9121102137 కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.