
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
టంగుటూరు అంబేద్కర్ పార్కులో ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు 73వ జన్మదిన వేడుకలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్బాబు మాట్లాడుతూ, విద్యావేత్తగా, హేతువాద ఉద్యమకారుడిగా, కారంచేడు–చుండూరు ఉద్యమాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి డా. కత్తి పద్మారావు అని కొనియాడారు. జై భీమ్ రావ్ భారత్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కే.వీ. కృష్ణారావు మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు కత్తి పద్మారావు అని పేర్కొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. ఆది, మాలల జేఏసీ నాయకులు క్రాంతికుమార్, దేవరపల్లి మురళీకృష్ణ, నత్తల నాని, కసుకుర్తి శరత్, దమ్మాల నాగేశ్వరరావు, వెంకన్న, భరత్, శ్రీకాంత్ రాజు తదితర నాయకులు, యువకులు పాల్గొన్నారు.