
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని హామీ.సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పముజుల దశరథ రామయ్య గారు జులై 24న నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన స్వగ్రామం సౌత్ మోపూరులోని నివాసంలో భౌతికకాయానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.