
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరవధిక ధర్నా మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ఆందోళనను కొనసాగించారు.ఈ సందర్భంగా ధర్నా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ దస్తావేజు లేఖర్లకు సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖర్ల సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు.ప్రభుత్వం దస్తావేజు లేఖర్లతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం వరకు తమ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.ధర్నాలో పాల్గొన్న దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు, సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు