
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రత, పోక్సో (POCSO) చట్టం, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళలపై నేరాల నివారణ, పోక్సో చట్టం ద్వారా చిన్నారులకు కల్పించిన రక్షణ, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు, మహిళలకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు.ఏదైనా అనుమానాస్పద ఘటన, వేధింపులు లేదా నేరాలు గమనించిన వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. సురక్షితమైన, నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు.