
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
అరెస్టులు పొగాకు రైతులు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం పై,100 0కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని,సరాసరి లో గ్రేడ్ పొగాకు ఇప్పటికే 160 రూపాయల కేజీ కొంటుంటే 110 రూపాయల కేజీ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలను వెనక్కు తీసుకోవాలని, సరాసరి పొగాకు కిలో 250 రూపాయలు కొనుగోలు చేయాలని కోరుతూ ఈరోజు 29వతేది ( బుధవారం) రోజు తేదీ వందలాది మంది పొగాకు రైతులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి దిగ్బంధం చేశారు, టంగుటూరు, కొండేపి,కందుకూరు వేలం కేంద్రాల పరిధిలోని గ్రామాల నుండి వందలాది మంది రైతులు పాల్గొన్నారు,దీంతో కిలోమీటర్లుపొడవు న వాహనాలు ఆగిపోయాయి,మార్కెట్లో పొగాకు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు దిగజార్చారు, గత సంవత్సరం కేజీ సరాసరి 250 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం సరాసరి 190 రూపాయలు పలుకుతూ పొగాకు రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు వ్యాపారుల ప్రయోజనాలరక్షణకే ఉంటున్నాయని నాయకులు అన్నారు, పొగాకుతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంటే వాటిల్లో 1000కోట్ల రూపాయలు కేటాయించడానికి వెనకాడడం వ్యాపారుల ప్రయోజనాలకె అన్నారు, ఇప్పటికైనా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రానట్లయితే ఢిల్లీ రైతాంగం తరహాలో చలో అమరావతి చేపడతామని నాయకులు హెచ్చరించారు, రాజకీయ పార్టీలకు అతీతంగా యస్ కె యం నాయకత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎస్ కే యం నాయకులు హెచ్చరించారు, జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తున్న రైతులను యస్ కి యం, రైతు సంఘాల నాయకులను అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరావు సిఎస్ సాగర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు సింగయ్య,కొండారెడ్డి, ఆర్ మోహన్, లక్ష్మీ, ప్రభాకర్, వెంకట్ రావు రఘురాం, ప మిడి నాగేశ్వరరావు, రమాదేవి ఏసుపోగు బాలకోటయ్య తదితరులు ఉన్నారు