
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం: స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో పాఠశాల భౌతిక అవసరాలను ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె. మహాలక్ష్మి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన మెగా పీటీఎం లక్ష్యాలు, పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్య ప్రాధాన్యాన్ని వివరించారు.
ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా సోమరాజుపల్లి గ్రామానికి చెందిన షేక్ కరిముల్లా (డిల్లు) పాఠశాల అభివృద్ధి కోసం రూ.50,000 తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేల్పుల సింగయ్య మాట్లాడుతూ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య నాయకత్వంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు స్ఫూర్తిగా తెలుగు యువత నాయకులు షేక్ కరిముల్లా (డిల్లు) మండల వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇప్పటికే సోమరాజుపల్లి పంచాయతీలోని పకీర్పాలెం ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.3 లక్షల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అదే విధంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి కూడా రూ.50 వేలతో అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమ ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు దాతలను అభినందించి, పాఠశాల అభివృద్ధికి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్రిబోయిన రాంబాబు, మాలేపాటి ప్రభాకర్ రెడ్డి, శీలం ప్రసాద్ రావు, తెలుగు యువత నాయకులు మసనం రాజగోపాల్, రఫీ, ఖాదర్ వలీ, బాపట్ల ప్రభాకర్ తదితరులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.