
రోడ్డు ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేయాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అద్దంకి డివిజన్లోని బంగ్లా రోడ్డు, భవాని సెంటర్, ద్వారకా నగర్ , సింగరకొండ జంక్షన్జ్ కొమ్మలపాడు ఏల్చూరు మరియు సంతమాగులూరు జంక్షన్ వద్ద ప్రమాదకర పరిస్థితి ఉన్న కూడళ్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు మరియు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కలిసి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రోడ్లపై వాహనాలను నిలుపైన వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. రోడ్లు అటువైపు ఇటువైపు హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతాలలో పిఏ సిస్టం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్ల పైన ఆక్రమణ ఉండకూడదని ఆయన అన్నారు. అవసరమైన కోడళ్ళ వద్ద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్పాతులను ఆక్రమించకుండా నిరోధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాకుండా స్పీడ్ లిమిట్ ను తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సింగరకొండ మలుపు వద్ద తారు రోడ్డుని వేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ రోడ్లు ఆక్రమణకు గురికాకుండా ఫుట్ పాతులపై షాపులు ఉంచకుండా సంబంధిత పోలీస్ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామ కూడళ్ల వద్ద పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ వాహనదారులను పాదాచారులను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. వాహనాలు రోడ్లపై నిలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు పోలీస్ అధికారులకు ఆదేశించారు. స్టేట్ హైవే నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్లే ప్రదేశాలలో రోడ్డుకి ఇరువైపులా ఎటువంటి షాపులు గాని, ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రంబుల్ స్టిప్స్, స్టట్స్ మలుపుల వద్ద మరియు గ్రామాల వద్ద, మరియు కుంభాకార దర్పణాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ఇంకా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టిటిసి సుశీల, దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, డిసిఆర్బిసిఐ దేవ ప్రభాకర్, అద్దంకి సీఐ సుబ్బరాజు, సంతమాగులూరు సిఐ శేషగిరిరావు, అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఆర్ అండ్ బి ఎస్ ఈ నాయక్, ఎక్స్ప్రెస్ హైవే అధికారులు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.