
కామ్రేడ్ దేవినేని మల్లికార్జున్,బాలిరెడ్డిలా 56వ వర్ధంతి సభ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ కామ్రేడ్ దేవి నేని మల్లికార్జున్, కామ్రేడ్ కోరిశ పాటి బాలిరెడ్డిల త్యాగాల స్ఫూర్తితో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న ఫాసిస్ట్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ కె, నాంచార్లు పిలుపునిచ్చారు, ఈరోజు అనగా శుక్రవారం కామ్రేడ్ బాలిరెడ్డి కామ్రేడ్ మల్లికార్జున్ స్థూపాల వద్ద 56వ వర్ధంతి జరిగింది, ఈ వర్ధంతిసభకు హాజరైన వారిని ఉద్దేశించి కామ్రేడ్ కి నాంచార్లు మాట్లాడుతూ ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో జన్మించిన కామ్రేడ్ దేవినేని మల్లికార్జున్ శ్రీకాకుళం సాయుధ పోరాటంలో 1970 జూలై 30వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం రంగ మాటియా కొండల్లో కర్కస పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లొ అమరుడయ్యాడు, కామ్రేడ్ కొరిస పార్టీ బాలిరెడ్డి గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలొ జన్మించాడు, 1970 జూలై 18వ తేదీన కనిగిరి పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేయబడి మన్నంకితిని అడవుల్లో ఈ
ఎన్కౌంటర్ లొ అమరుడయ్యాడని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాల ఒలంపిస్తున్న పాలకులు ప్రశ్నిస్తున్న వారిని అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పాలు చేస్తున్నారని, అమెరికా భారత వాణిజ్యం ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి జీరో పన్నుల తోటి ఆహార పంటలు దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించటం వల్ల భారత రైతంగం మరింత సంక్షోభంలో కూరుకు పోతుందని ఆంధ్రప్రదేశ్ లొ పొగాకుపంట కు ధరల లేక రైతాంగం గత రెండున్నర నెలలుగా పోరాడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండావ్యాపారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇంకా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్ మోహన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల్లో ఫాసిస్టు మోడీ ప్రభుత్వం 356 ప్రభుత్వంగ పరిశ్రమలను ప్రైవేటీకరించిందని, గత 12 సంవత్సరాల్లో రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఒక్క రైల్వే రంగంలోనే 13 లక్షల మంది ఉన్న కార్మికులు నేడు 9:30 లక్షల మందికి చేరారని,కార్మికులకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల రేట్లు కనుకూలంగా కనీస వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడికి పాల్పడుతుందని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను కొనసాగిస్తూ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బాబురావు, అఖిల భారత రైతు కూలీ సంఘం(aikms) మండల నాయకులు సిహెచ్ అలెగ్జాండర్, టి ఆంజనేయులు, సిహెచ్ భాస్కరరావు ,జై భీమ్ అంబేద్కర్ అసోసియేషన్ నాయకులు అంబటి కొండలరావు,