
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ… “అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసి చూపించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.”“కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు గర్వంగా వివరించే అవకాశం మనకు లభించింది. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ విజయాలను విస్తృతంగా తెలియజేయాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, వేంపాడు గ్రామ టీడీపీ నాయకులు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.