
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడుపూరు గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై ఎస్ఐ మార్కాపురం టౌన్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 6 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,610 నగదుతో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.జిల్లాలో జూదం, బహిరంగ మద్యం సేవించడం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.