
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బంది, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సమక్షంలో పాలుకూరు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహిస్తున్న జూదంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 7 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.63,450 నగదు, 11 మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జిల్లాలో జూదం, బహిరంగ మద్యం సేవించడం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.