
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐ.వి సుబ్బారావు పుట్టినరోజు సేవ కార్యక్రమాలు……
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు జన్మదిన వేడుకలు ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ః ఆధ్వర్యంలో ప్రతిరోజు పేదలకు అన్నం పెట్టి కడుపు నింపుతున్నారని ఈ ఫౌండేషన్ కి ధనవంతులు దాతృత్వంతో ఆర్థిక సహకారం అందించాలని తెలిపారు. మా తండ్రి ఐవి శ్రీరాములు మాస్టర్ గారి జ్ఞాపకార్థం మన జిల్లాలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను గుర్తించి ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఐ వి సుబ్బారావు పుట్టినరోజు ఆర్భాటాలకు పోకుండా శివం శరణాలయంలో వృద్ధులు మధ్య జన్మదినోత్సవం జరుపుకుని వారికి పండ్లు కాయలు పంపిణీతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజన ఏర్పాటు చేయడం ఒంగోలు నగరంలో అనాధలు యాచకులకు 400 మంది పైగా అన్నదానం నిర్వహించాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్లు (చౌదరి ) తోపాటు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగులు సురేష్.
జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య. బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు. జిల్లా మాజీ కార్యదర్శి హరిబాబు.
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇఫ్తేకర్..
స్మాల్ అండ్ మీడియా అసోసియేషన్ (సామ్నా) జిల్లా నాయకులు బంగి లింగరాజు, మరియు పటాన్ అనీఫ్ ఖాన్. గంగా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బంగి రంగన్న .ప్రముఖ వ్యాపారవేత్త మండవ లక్ష్మీప్రసాద్ .ఏపీ ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు,
ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు కోటిరెడ్డి కె విజయ్ , సర్వేశ్వరరావు,శరత్ ,సుబ్బారావు, ప్రతాప్, అశోక్, తదితరులు పాల్గొన్నారు,