
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా… అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను సకాలంలో అందిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణం, సందువారిపాలెం గ్రామంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, దర్శి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ శ్రీమతి దారం నాగవేణి – శ్రీ సుబ్బారావు గార్లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను అందజేశారు.