
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, వాటి తీవ్రత గురించి వివరించారు. ప్రతి ప్రయాణంలో నాణ్యమైన ఐఎస్ఐ (ISI) ప్రమాణాల హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.