
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు మరియు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు."మద్యం సేవించి వాహనం నడపొద్దు… మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి" అని మార్కాపురం జిల్లా పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.