
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి నియోజకవర్గంలోని దొనకొండ టౌన్, ఎర్రబాలెం ఎస్సీ కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల నమ్మకమే మా బలం… ప్రజా సంక్షేమమే మా లక్ష్యం!