
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు "Face Wash & Go" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, ముఖం కడుక్కొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ, అవసరమైతే టీ/తాగునీరు అందించి అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నారు."మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది… అలసటగా అనిపిస్తే కాసేపు ఆగండి, ముఖం కడుక్కొని తాజాదనంతో సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించండి." అనే సందేశంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు.