
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, వై.పాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో గత 10 రోజుల వ్యవధిలో పోగొట్టుకున్న 41 మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవంతంగా గుర్తించి రికవరీ చేశారు.
అనంతరం ఎర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయా మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.