
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల అరికట్టడంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, డార్మిటరీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో లాడ్జీల రిజిస్టర్లు, అతిథుల గుర్తింపు వివరాలు, సీసీ కెమెరాల పనితీరు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు సూచించారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.