
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం, మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు, విద్యార్థినులు సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, పార్కులు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పర్యవేక్షించారు. మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం లేదా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.మహిళల భద్రతకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ, నేరాల నివారణకు ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.