
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 49 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
జిల్లా ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని మార్కాపురం అడిషనల్ ఎస్పీ ఓఎస్డీ(అడ్మిన్) శ్రీ నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీస్ అధికారులు నిర్వహించారు.ఈకార్యక్రమంలో జిల్లాలోని నలుదిక్కుల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వ్రాతపూర్వక వినతులను మార్కాపురం ఓఎస్డీ(అడ్మిన్) గారు స్వీకరించి వారితో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్ట పరిధిలో విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. అందిన ఆయా ఫిర్యాదులపై అడిషనల్ ఎస్పీ గారు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా పోలీసు కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు, మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్, కంభం సీఐ మల్లికార్జున, గిద్దలూరు టౌన్ సిఐ సురేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.