
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి నిర్వహించి 4 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.2,450 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అలాగే టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారెడ్డిపాలెం లారీ యూనియన్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన మరో దాడిలో 5 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.5,900 నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో జూదం, పేకాట మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇలాంటి ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.