
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కలంకౌంటర్,నెల్లూరులోని రోటరీ క్లబ్ ఆదివారం యం.వి.రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాలు 2026 కందుకూరు కు చెందిన ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావుకు అల్లూరి సీతారామరాజు పురస్కారం , శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వాసవి సేవాదళ్ తరపున సేవలందించినందుకు కేశవరావుకు, అనునిత్యం సేవలందిస్తున్న శ్రీరామ సాయిబాబా సొసైటీ నిర్వాహకుడు శ్రీనివాసులు ఈ సేవ పురస్కారాలు అందజేశారని వరి తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న దాతలకు ఈ అవార్డు అంకితమని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం ఎం.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ను ఘనంగా సన్మానించారు.