
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, రాజకీయ నాయకుడు,మాజీ మంత్రి మండలి శ్రీ వెంకట కృష్ణారావు గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు గారు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అరించారు.ఈ సందర్భంగా ఎఆర్ డీఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన ఉన్నతమైన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలు పాటించిన గొప్ప వ్యక్తి, ఉన్నత పదవుల్లో ఉన్నా సామాన్యుడిలా జీవిస్తూ ప్రజలకు సేవ చెయ్యడం పరమావదిగా భావించి అందరికి ఆదర్శంగా నిలిచారు. దివిసీమ ఉప్పెన సంభవించిన సమయంలో బాధితులను ఆదుకోవడంలో ముందుండి సేవలందించిన ఆయన, వేలాది కుటుంబాలకు అండగా నిలిచారని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా "దివిసీమ గాంధీ" అనే బిరుదును పొందారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.