
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మిషన్ హరిత ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కల నాటకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ద్వారా ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ మరింత పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ కాలుష్యన్ని నివారించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని,మనం ఉపయోగించే వాహనాల అధిక వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ వంటి వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుందని, అదే ప్రాణ వాయువు అని,మనం చేసే పనుల వల్ల కాలుష్యం రోజురోజుకూ పెరిగి అనేక జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. కనుక మొక్కలు నాటడం వల్ల ప్రాణవాయువును పెంచడంతోపాటు జీవరాశులు అంతరించిపోకుండా మేలు చేసిన వారవుతారని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కలను పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు,అడిషనల్ ఎస్పీ (క్రైమ్) సిహెచ్ వెంకటేశ్వర్లు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ విజయ కృష్ణ, ఒంగోలు టు టౌన్ సీఐ వీర నాయక్ ఒంగోలు రూరల్ సీఐ శేషారిగి రావు, ఆర్ఐ లు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్ఐలు ఏఆర్ ఎస్ఐ లు, సిబ్బంది మరియు అపెక్స్ విద్యార్థులు పాల్గొన్నారు.