
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కట్టుబడిపాళెం 1వ వార్డులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను మరియు రూ.7.26 కోట్లతో పెద్దూరు, పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుబడిపాళెం లేఅవుట్లు, వీకర్స్ సెక్షన్ కాలనీల్లో తాగునీటి సరఫరా పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాను. స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను.