
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మండలం బి టి ఏ సభ్యత్వ నమోదు క్యాంపియన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు బిటిఎ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిటిఏ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్లా మాట్లాడుతూ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు విద్యా బోధనకు ఆటంకంగా ఉన్నాయని వాపోయారు. మానసికంగా ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. 30% IR ప్రకటించాలని, పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండల ట్రెజరర్ సిహెచ్ కొండలరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో బిటిఎ ముందంజలో ఉంటుందని వివరించారు. బుధవారం పాఠశాలల్లో ప్రవేశపెట్టబడిన ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన కోసం ఆరోజు బిటిఏ సంఘం ప్రధానంగా డిమాండ్ చేసిందని వివరించారు.
కందుకూరు మండలం అధ్యక్షులు మన్నెం.మోహన్ రావు మాట్లాడుతూ బిటిఏ ఉపాధ్యాయుల సమస్యలపైనే కాకుండా, సామాజిక దృక్పథంతో పనిచేస్తుందని వివరించారు. కందుకూరు మండలం బి టి ఏ ప్రధాన కార్యదర్శి ధన్యాసి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క బహుజన టీచర్స్ అసోసియేషన్ మాత్రమే పూలే,అంబేద్కర్ భావజాలంతోపనిచేస్తుందని, బహుజన భావజాలంతో పనిచేస్తుందని ఉపాధ్యాయులందరు బిటిఎ ని ఆదరించాలని వివరించారు.ఈ కార్యక్రమంలో బి టి ఏ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కల్లగుంట మోహన్ రావు మాట్లాడుతూ ఈరోజు కందుకూరు మండల్ క్యాంపియన్ లో పాల్గొన్న బిటిఎ ఉపాధ్యాయులకు మరియు ఈరోజు కందుకూరు మండలంలో బీటీఏకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బిటిఎ బాధ్యులు బొజ్జ రమణయ్య, మెండ వెంకట్రావు మొదలగువారు పాల్గొన్నారు.