
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం : జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.
హాజరుకానున్న జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేస్తూ, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈనెల 07వ తేదీన (శుక్రవారం) గిద్దలూరు నియోజకవర్గంలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు' (One Month, One Constituency, Four Visits) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.అర్ధవీడు గ్రామం / మండలం లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన కోసం జిల్లా స్థాయి అన్ని శాఖల అధిపతులు (District HoDs), గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులు (MPDOs), గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ, అర్ధవీడు మండలంతో పాటు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తమ అర్జీలు, సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. అధికారులు ఎటువంటి అలసత్వం వహించకుండా, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.