
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆధ్వర్యంలో దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో నిషేధిత వస్తువులు, అక్రమ మద్యం విక్రయాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులకు చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించాలని, అక్రమ మద్యం లేదా నిషేధిత వస్తువుల విక్రయాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మార్కాపురం రూరల్ పోలీసులు తెలిపారు.