
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మద్దిపాడు మండలం నటరాజు కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రైతన్న మీకోసం' కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ గారి సూచనలు:
ప్రత్యామ్నాయ పంటల సాగు: ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు సాధారణ పంటలకు బదులుగా తక్కువ నీటితో, స్వల్పకాలంలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి.ప్రకృతి వ్యవసాయం: రసాయన ఎరువు తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చి భూసారాన్ని కాపాడుకోవాలి.అధికారుల సలహాలు: వ్యవసాయ అధికారులు ఇంటింటికీ తిరిగి ఏ ఏ పంటలు వేసుకోవాలో రైతులకు క్షేత్రస్థాయిలో మార్గదర్శకత్వం చేస్తారు.పశుగ్రాస సంరక్షణ : వర్షాభావ పరిస్థితుల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.ఉపాధి హామీ: ఉపాధి హామీ పథకం ద్వారా వేతనదారులకు పనులు కల్పించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రైతులకు PMDS విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేక గోడపత్రికను కలెక్టర్ గారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో RDO చంద్రశేఖర్ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, శాస్త్రవేత్త రమేష్ మరియు రైతులు పాల్గొన్నారు.