
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈవ్ టీజింగ్ నివారణ చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, పార్కులు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు ఎలాంటి వేధింపులు, అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా అత్యవసర సేవల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు.