
మాజీ మంత్రి బాలినేని తో ఇరిగెలా సూర్యనారాయణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి భేటీ…
తొలి శుభోదయం న్యూస్ హైదరాబాద్:-
మాజీ మంత్రి,జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు,ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ని హైదరాబాదు నగరం లోని మాదాపూర్ లో ఉన్న తన నివాసంలో ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇరిగెలా రాంపుల్లారెడ్డి సోదరుడు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిది ఇరిగెలా సూర్యనారాయణ రెడ్డి,బిజెపి నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త( స్టాండర్డ్ ఫ్లోరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్) సి.చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం న మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..ఇటీవల కాలంలో జనసేన పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కి జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలను అప్పగించారు..ఈ నేపథ్యంలో వారి ఇరువురి మధ్య ప్రస్తుతం రాష్ట్రం లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు..రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం,అభివృద్దే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు..పేదలు,
బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు..ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించినట్టు వెల్లడించారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులు విజయం కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు..ఈ కార్యక్రమం లో మట్లి వేణు,భాస్కర్ రెడ్డి, మాజీ డి ఆర్ యు సి సి మెంబర్ ఎమ్.ఎన్ రెడ్డి,అన్వర్ హుస్సేన్,వెంకట రాజేష్ తదితరులు పాల్గొన్నారు..