
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని సింగరాయకొండ కృష్ణ మహేష్ జై కృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ట్రంక్ రోడ్డులో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శివరామిరెడ్డి హాస్పిటల్, నారాయణ హాస్పిటల్లలో చికిత్స పొందుతున్న రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు అభిమానులు నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కృష్ణ అభిమానులు డాక్టర్ అజయ్ బాబు, సంఘం అధ్యక్షులు బచ్చు కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు ఎస్.కె. భాష, ఉపాధ్యక్షులు పటాన్ సుభాని, రాష్ట్ర కార్యదర్శి రాయి విజయ్ చంద్‌తో పాటు సీనియర్ కృష్ణ–మహేష్ అభిమానులు సాహెబ్, ఎస్.డి. సిరాజ్, మాధవరావు, కలాం, కావేటి శీను, రేమెన్స్ టైలర్, ఎమరాల్డ్ టైలర్, ఎస్.కె. ఖలీల్, పవన్, హేమకుమార్, తాళ్లూరి రమేష్, ఏల్చూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులకు, అలాగే కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన డాక్టర్ అశోక్, డాక్టర్ అజయ్, శశిధర్ రెడ్డి తదితరులకు అభిమాన సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
