
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కంభం పట్టణంలోని అరఫాత్ నగర్ కాలనీలో కంభం సీఐ మరియు సిబ్బందితో కలిసి కంభం పోలీసులు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులను పరిశీలించడంతో పాటు, నిషేధిత/అక్రమ వస్తువుల కోసం తనిఖీలు నిర్వహించారు. నివాసితుల వివరాలు, గత నేర చరిత్రను కూడా పరిశీలించారు.
అనంతరం స్థానికులకు ఆస్తి నేరాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రత, మహిళలపై నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజల భద్రతకు కంభం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.