
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అడవిరాజుపాలెం మామిడి తోటలో గూడ్లూరు పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.23,210 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని సూచించారు.