
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో నిండిన "డి.ఎస్సీ నియామకాలు"… నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేసి అడ్డదారిలో ఉద్యోగాలను అమ్ముకున్న కూటమి దుర్మార్గపు పాలనపై వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ|| మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీల నిర్వహణలో భాగంగా సోమవారం దర్శి నియోజకవర్గం కేంద్రం దర్శి పట్టణంలో… దర్శి శాసనసభ్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి … జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారి ఆధ్వర్యంలో… DSC అవినీతి నియామకాలకి భాధ్యత వహిస్తూ … విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ… నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ ఆఫీసు నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో వేలమంది ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలంటూ నిరసన తెలియజేశారు. గడియారం స్తంభం సెంటర్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ||శే||రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య పాల్గొని విజయవంతం చేశారు.