
తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:-
దాతల సహకారం మరువలేనిది. వలేటివారిపాలెం మండలం నలదలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనకు దాతలు సహృదయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దాతలు మన్నం సురేష్, తాటికొండ రామయ్య, తాటికొండ లక్ష్మయ్య, చల్ల శ్యామ్, అత్తోట సురేష్, దామా రాంబాబు,అత్తోట కృష్ణమోహన్ బత్తిని వేణుగోపాల్, నార్నేని వెంకటేశ్వర్లు, అత్తోట సుధాకర్, సిరిగిరి ఉష, అత్తోట రమణయ్య, ఆత్మకూరు హనుమంతురావులు, మాట్లాడుతూ తమకు చదువు నేర్పిన కన్నతల్లి లాంటి పాఠశాలకు ఈ విధంగా రుణం తీర్చుకునే అవకాశం కలిగినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని తమ కుటుంబ పెద్దల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా దాతలు తెలియజేశారు. దాతల సహకారం మరువలేనిదని వారు ఎల్లప్పుడూ పాఠశాల పట్ల సహృదయంతో ఇదే విధంగా స్పందించాలని వారికి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరకాయల మాధవరావు తెలియపరిచారు. మండలంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన తొలి పాఠశాల నలదలపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి బాధ్యతతో నడిపించిన నలదలపూరు గ్రామ వాస్తవ్యుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు హనుమంతరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పొన్నగంటి రామయ్య మరియు పాఠశాల యావన్మంది సిబ్బంది పాల్గొన్నారు.