
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం మాది. ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి కంటే, రాబోయే మూడేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధిని చూడబోతున్నారు. ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. అందుకు మీరంతా సహకరించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను. అన్ని రంగాలలో కందుకూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను….. అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా గుడ్లూరు మండలం ఏలూరుపాడు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గారు సోమవారం సాయంత్రం పర్యటించారు. రెండేళ్ల ప్రగతిని వివరిస్తూ స్థానికులకు కరపత్రాలు పంచారు. ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పిన నాగేశ్వరరావు… ఏలూరుపాడులో రెండేళ్లలో తల్లికి వందనం పథకం ద్వారా 176 మంది విద్యార్థులకు 52.8 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 287 మందికి 77.49 లక్షలు, ప్రతినెలా 132 మందికి 5.23 లక్షల విలువైన పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 18 పొదుపు గ్రూపులకు 64 లక్షల రుణాలు అందించామని, జి రామ్ జి పథకం ద్వారా 35 వేల పని దినాలు కల్పించి 95 లక్షల రూపాయలు ఖర్చు చేసామని నాగేశ్వరరావు తెలిపారు.
ఇంకా రోడ్లు, తాగునీటి పైపులైన్లు, స్మశానాల అభివృద్ధి, డంపింగ్ యార్డ్ పనులకు 12.37 లక్షల రూపాయలు వినియోగించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. 21లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడమే గాక, మంగలికుంట, వాయలచెరువులను 9.6 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. మొత్తంగా పంచాయతీలో 43 లక్షలతో అభివృద్ధి, 3.13 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, అంగన్వాడికి సొంత భవనం, ఇంకా సిసి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. శాంతినగర్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, శాంతినగర్ లో స్మశానాలను అభివృద్ధి చేయాలని కోరారు. పెండింగ్ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. వాటికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని, మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామపార్టీ అధ్యక్షులు పర్రె రామారావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గద్దగుంట శ్రీను, గద్దగుంట రామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు నిమ్మకాయల రమణయ్య, మాజీ సర్పంచ్ స్వర్ణ కొండయ్య, క్లస్టర్ ఇంచార్జిలు చిత్తారి మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, ఏఎంసి వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రమణమ్మ, యూనిట్ ఇంచార్జ్ పోలుగంగు కృష్ణ, నరాల మాలకొండారెడ్డి, వెంకటేశ్వర్లు, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.