
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్, మహిళలు మరియు బాలికలపై వేధింపులను నివారించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచే చర్యల్లో భాగంగా పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల వద్ద డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు మరియు వేధింపులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు నిర్భయంగా సంచరించేలా పోలీసుల నిఘా మరియు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.