
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పీసీ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ మరియు మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీసు సేవలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ప్రజల భాగస్వామ్యంతో సురక్షిత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యం.