
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు TLM మరియు ఆర్ఎల్ఎం గురించి తెలియజేయడమైనది. ఆర్ ఎల్ ఎం అంటే రిమోట్ లెర్నింగ్ మెసేజ్. కోవిడ్ 19 కారణంగా అంగన్వాడీ విద్యా కార్యక్రమాలు కు అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయన్ని తగ్గించి పిల్లలందరికి విద్యను అందించేవిధంగా ICDS వారు తల్లులకు వాట్స్అప్ మెసేజ్ల ద్వారా రోజు వారి ఇంటి కృత్యాలును చేరవేయటం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. ఆ మెసేజ్లు ద్వారా తల్లిదండ్రులు, పిల్లలతో ఇంటి దగ్గరనే కృత్యాలు చేయించటానికి వీలుగా ఉండేది. ఇంకా ఈ కృత్యాలను బలోపేతం చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ అమలను ఏకీకృతం చేయడం అంగన్వాడీ కార్యకర్తలకు నిరంతరము మార్గదర్శక సహకారం అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈ పిల్లలను పాఠశాలకు సంసిద్ధం చేయడం గురించి తెలియజేయడమైనది. తర్వాత అంగన్వాడీ సెంటర్ నిర్వహణ మరియు సెంటర్ వాతావరణం గురించి, పాఠశాల సంసిద్దత గురించి తెలియచేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిధులుగా జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం పి. రామ్మోహన్ గారు, ఎంఈఓ 1 బి. హరి రామ్ , కె ఆర్ పి పి.వాణి హాజరైనారు.ఈ శిక్షణా కార్యక్రమాన్ని డిఆర్పిలు ఏ విజయ్ కుమార్ టీ చంద్రశేఖర్ కే కామేశ్వరి నిర్వహించటం జరిగినది