
స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల సందర్భంగా దర్శిలో ఘనంగా తిరంగా యాత్ర (సైకిల్ ర్యాలీ)
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
స్వాతంత్ర్య సమరయోధులు, వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తితో దర్శి పట్టణంలో డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలని, సైనికులు, పోలీసుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక మొక్క నాటడం నుంచి సమాజ అభివృద్ధికి చేసే ప్రతి చిన్న మంచి పని కూడా దేశసేవేనని పేర్కొన్నారు. “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత బలపరచాలని ప్రజలను కోరారు.ఈ తిరంగా యాత్రలో అధికారులు, ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ, మెప్మా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, యువత, మహిళలు, దేశభక్తులు పెద్ద ఎత్తున పాల్గొని “భారత మాతకు జై” అంటూ నినదించారు.