
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరులోని వీపీఆర్ (VPR) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన బాధితులకు 28వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశాను. 23 బాధిత కుటుంబాలకు రూ.13.67 లక్షల విలువైన చెక్కులను అందజేశాను. అదేవిధంగా నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున మరో 12 కుటుంబాలకు రూ. 7.70 లక్షల విలువైన సహాయాన్ని పంపిణీ చేశాను.పేదల పెద్దదిక్కుగా నిలిచి ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోవూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 1,100 మందికి దాదాపు రూ. 10.75 కోట్ల ఆర్థిక సాయం అందజేశాను.